బిగ్ బాస్ 4 – శివగామిలో లక్షణాలు ముగ్గురికి ఇచ్చిన అభిజీత్.!

బిగ్ బాస్ 4 – శివగామిలో లక్షణాలు ముగ్గురికి ఇచ్చిన అభిజీత్.!

Published on Dec 10, 2020 3:01 PM IST

abhijeet

ప్రస్తుతం మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయినటువంటి బిగ్ బాస్ హౌస్ లో ఇంకా కొంతమంది సభ్యులే మిగిలి ఉన్నారు. దీనితో ఈ వారం ఎవరు వెళ్ళిపోతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అలాగే మరోపక్క బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు కూడా ప్రతీ రోజు మరిన్ని రకరకాల టాస్కులు ఇస్తున్నారు. అలా ఈరోజు ఎపిసోడ్ లో కూడా ఓ టాస్క్ ను ఇచ్చినట్టుగా లేటెస్ట్ ప్రోమోతో చూపించారు.

ఎవరు ఎక్కువ ఫోకస్డ్ గా ఉంటారు అన్న దాంట్లో అభిజీత్ ను బాహుబలి శివగామిలో ఉన్న లక్షణాలు బిగ్ బాస్ హౌస్ లో ఎవరికి ఇస్తావ్ అంటే. శివగామిలో అందం మోనాల్ కు టెర్రర్ అరియానాకు అలాగే ప్రేమ హరికకు అంటూ ఆమెలోని మూడు లక్షణాలు ముగ్గురికి పంచేసాడు. అయితే ఇదంతా అతన్ని టాస్క్ లో ఫోకస్ తప్పించడానికే చెయ్యగా వారికి ఇలాంటి సమాధానం ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు