ఇప్పుడు మన తెలుగు నుంచి ఇండియన్ బాక్సాఫీస్ ను మరోసారి ఏలడానికి వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ పీరియాడిక్ డ్రామా “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో ఈ ప్రధాన లీడింగ్ కు ఇద్దరు టాప్ మోస్ట్ హీరోయిన్స్ ను తీసుకున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నుంచి ఆలియా భట్ ను రామ్ చరణ్ కు సీతగా రాజమౌళి తీసుకొచ్చారు. ఇటీవలే ఆమెతో షూట్ ను కూడా జరిపిన సంగతి తెలిసిందే. అలాగే ఆలియా తన మొట్ట మొదటి సినిమా అయిన దీనిలో తన తెలుగు డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈమె ఇందుకు స్పెషల్ క్లాసులను కూడా తీసుకొంది. కానీ ఆమె తెలుగుతో ఏ రేంజ్ లో కుస్తీలు పడుతుంది అంటే..
నిద్దట్లో కూడా రాజమౌళి తనకు ఇచ్చిన డైలాగ్ లైనర్లు చెప్పుకుంటుందట.ఇంతేనా నిద్ర లేచి తినేటప్పుడు ఉదయం మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూట్లా తెలుగు లైన్స్ తో కుస్తీ పడుతుందట. అలాగే దాదాపు సంవత్సరంన్నర నుంచి తన డైలాగులతో గడుపుతున్నానని ఈ కొత్త ఎక్స్ పీరియన్స్ చాలా భిన్నంగా ఉందని ఆమె లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపినట్టు తెలుస్తుంది. మరి ఆలియా డెబ్యూ ఎలా ఉంటుందో అని చాలా మందే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.


