మృణాల్ తో ఐకాన్ స్టార్..? హింట్ ఇచ్చిన బన్నీ

మృణాల్ తో ఐకాన్ స్టార్..? హింట్ ఇచ్చిన బన్నీ

Published on Feb 26, 2026 6:12 PM IST

allu-arjun-and-Mrunal-Thark

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పలు భారీ సినిమాల లైనప్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాల్లో దర్శకుడు అట్లీతో చేస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాల్లో హీరోయిన్స్ చాలా మందే ఉంటారు అని వారిలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు అంటూ కొన్ని రూమర్స్ ఆ మధ్యన వచ్చాయి కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని తేలిపోయింది. కానీ లేటెస్ట్ గా ఐకాన్ స్టార్ పోస్ట్ తో ఈ క్రేజీ కాంబినేషన్ పై హిట్ బయటకి వస్తుంది.

ఇటీవల బన్నీ అందుకున్న ఫిల్మ్ ఫేర్ అవార్డు విషయంలో మృణాల్ ఠాకూర్ బెస్ట్ విషెస్ చెబుతూ తనకి గ్రీటింగ్స్ పంపింది. దీనితో ఆమెకి ధన్యవాదాలు తెలుపుతూ ఏదొక రోజు నీతో వర్క్ చెయ్యాలని ఆశిస్తున్నాను అంటూ ఓ కన్ను కొట్టే ఎమోజి పక్కన పెట్టి చిన్నగా హింట్ ఇచ్చాడు. దీనితో ఇప్పుడు అట్లీ సినిమాకి కాకపోయినా ఈ కాంబినేషన్ పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి అది ఏ సినిమాకి సాధ్యం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.

AA-and-Mrunal-Tharkur

సంబంధిత సమాచారం

తాజా వార్తలు