‘రెడ్’తో రామ్ ఇమేజ్ రెండింతలు అవుతుంది – దిల్ రాజు

‘రెడ్’తో రామ్ ఇమేజ్ రెండింతలు అవుతుంది – దిల్ రాజు

Published on Dec 24, 2020 6:23 PM IST

red
ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. పూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మాస్ జనాన్ని ఒక ఒప్పు ఊపేసింది. ముఖ్యంగా వరుస పరాజయాల్లో ఉన్న రామ్ ను పైకి లేపడమే కాదు మాస్ హీరో అనే పేరును కూడ ఒఇచ్చింది. ఈ సినిమా తర్వాత వస్తున్న చిత్ర కావడంతో ‘రెడ్’ మీద మంచి అంచనాలున్నాయి ప్రేక్షకుల్లో. తాజాగా విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ట్రైలర్ రిలీజ్ సందర్బంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతో ‘చాక్లేట్ బాయ్ ఇమేజ్ నుండి ఇస్మార్ట్ శంకర్ లో విశ్వరూపం చూపించి మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రామ్. ‘రెడ్’తో దాన్ని రెండింతలు చేసుకోనున్నాడు. డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ చిత్రంతో తాను కూడ మాస్ చిత్రాలు తీయగలనని చూపించుకున్నాడు. ఖచ్చితంగా హిట్టు కొట్టబోతున్న చిత్రం ఇది అన్నారు.

మరొక నిర్మాత దామోదర్ మాట్లాడుతూ రామ్ పోతినేని మన తెలుగు పరిశ్రమలో ఉన్నవాళ్లందరిలో చాలా ఎనర్జిటిక్ స్టార్ అని నా అభిప్రాయం. ట్రైలర్ చూశాక, పరిశ్రమ మళ్ళీ పుంజుకోడానికి ఇంత ఎనర్జీ అవసరం అనిపిస్తుంది. ప్రేక్షకులని ఇలాంటి పరిస్థితుల మధ్య థియేటర్లకు వచ్చేలా చేయాలంటే చాలా గట్టి కథ కావలి. ఇది ఖచ్చితంగా అలాంటి చిత్రమే అన్నారు. కిషోర్ తిరుమల అయితే ఈ పది నెలల్లో కోల్పోయిన ఆనందాన్ని ఈ సినిమా థియేటర్లలో అందిస్తుందని సక్సెస్ మీద ధీమా వ్యక్త చేశారు.

హీరో రామ్ మాట్లాడుతూ ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం, వంట చేసుకోగలిగినా హోటల్ కి వెళతాం, అలాగే ఎన్ని ఓ.టి.టి వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం. ఆ అనుభూతే పూర్తిగా వేరుగా ఉంటుంది. ప్రేక్షకులందరూ జాగ్రత్తగా ఉంటూనే థియేటర్లకు రావాలి. జాగ్రత్త, ఎంటర్టైన్మెంట్ రెండూ ముఖ్యమే అన్నారు. చిత్ర బృందం మొత్తం సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు