రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..డిశ్చార్జ్ అయిన తలైవర్!

రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..డిశ్చార్జ్ అయిన తలైవర్!

Published on Dec 27, 2020 3:43 PM IST

Rajinikanth 1

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే కాస్త అనారోగ్యంతో తన సినిమా షూట్ నుంచే హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. బీపీ లోని హెచ్చు తగ్గులతో గత మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్న తలైవర్ త్వరగా కోలుకోవాలని అంతా కోరుకున్నారు.

మరి వారి అందరి బలమైన సంకల్పంతో రజినీ కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు సమాచారం బయటకు వచ్చింది. ఇక ఈ మూడు రోజులు చికిత్స పొందిన రజినీ ఈరోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యి చెన్నై కు ప్రయాణం అయ్యారు. అలాగే వైద్యులు వారం రోజులు తప్పనిసరి విశ్రాంతి ఉండాలని సూచించారు. ఈ వార్త విన్న రజినీ అభిమానులు ఇపుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

అయితే రజినీ మళ్ళీ ఎప్పుడు తన కార్యకలాపాలు మొదలు పెడతారు అన్నది ఆసక్తిగా మారింది. ఈ నెల ఆఖరున అలాగే వచ్చే ఏడాది రానున్న సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన చేస్తున్నట్టుగా తెలిపారు. మరి దీనిపై ముందస్తు క్లారిటీ ఏమన్నా ఇస్తారో చూడాలి. మొత్తానికి తలైవర్ సేఫ్ అవ్వడం అందరికీ ఆనందం కలిగించే అంశం అని చెప్పాలి.

rajini

సంబంధిత సమాచారం

తాజా వార్తలు