2020 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డులను ప్రకటించారు. గత ఏడాదిలో తమ ప్రతిభ చూపిన పలువురు నటీనటుల్ని ఈ అవార్డు వరించింది. మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ అవార్డును సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున సొంతం చేసుకున్నారు. ఇక ఉత్తమ నటుడిగా నవీన్ పోలిశెట్టి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో ఆయన కనబర్చిన నటనకు ఈ అవార్డు వరించింది. సినిమా విజయంలో నవీన్ నటన ప్రధాన ఎలిమెంట్ అయింది.
అలాగే ఉత్తమ నటిగా రష్మిక మందన్న పాల్కే అవార్డును అందుకోనుంది. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో లిల్లీ పాత్రలో రష్మిక కనబర్చిన ప్రతిభకు ఈ అవార్డ్ ఆమెను వరించింది. ఉత్తమ చిత్రంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన ‘జెర్సీ’ నిలిచింది. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్ అవుతోంది కూడ. అలాగే ఉత్తమ దర్శకుడిగా సుజీత్ ఎంపికయ్యారు. ప్రభాస్ హీరోగా చేసిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’కు గాను ఈ అవార్డ్ ఆయన్ను వరించింది. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యారు. 2019లో ఆయన ‘మిస్టర్ మజ్ను, ప్రతిరోజూ పండగే, మజిలీ’ సినిమాలకు మంచి సంగీతం అందించారు.


