పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానంటున్న ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్

పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానంటున్న ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్

Published on Jan 5, 2021 11:58 PM IST

Santosh Srinivas

పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేయాలనుకున్న చాలామంది దర్శకులకు ఆయన రీఎంట్రీతో కొత్త ఆశలు చిగురించాయి. మళ్ళీ అందరూ పవన్ డేట్స్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. పవర్ స్టార్ ప్రస్తుతం వేణు శ్రీరామ్, సాగర్ కె చంద్ర, క్రిష్, హరీష్ శంకర్, త్రివిక్రమ్ లాంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఇంకా చాలామంది దర్శకులు పవన్ కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. వారిలో సంతోష్ శ్రీనివాస్ కూడ ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన సంతోష్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్నారు.

ఆయన చేసిన ‘కందిరీగ, రభస, హైపర్’ అన్నీ కుటుంబ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటెర్టైనర్లు. ఇది మన పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా. ప్రజెంట్ ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రం చేశారు. ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సినిమాను కుటుంబం మొత్తం థియేటర్లోకి వచ్చి హాయిగా నవ్వుకునేలా మలిచానన్న సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌తో తప్పకుండా సినిమా చేస్తానని అంటున్నారు. ఆయన ధీమా చూస్తే పవర్ స్టార్ కోసం కథను కూడ సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తున్నారు. ‘అల్లుడు అదుర్స్’ మంచి విజయాన్ని అందుకుంటే పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలనే ఆయన లక్ష్యానికి మార్గం సుగమం అయినట్టే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు