ఓటీటీ సమీక్ష : D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు – జీ5లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

ఓటీటీ సమీక్ష : D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు – జీ5లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

Published on Feb 27, 2026 1:50 PM IST

DaughterOfPrasadRaoKanabadu

ఓటీటీ వేదిక : జీ5
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : ఫిబ్రవరి 26, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రాజీవ్ కనకాల, వసంతిక, ఉదయభాను, గాయత్రి భార్గవి, హిమబిందు తదితరులు
దర్శకత్వం : కృష్ణ పోలూరు
నిర్మాత : కె.వి.శ్రీరామ్
సంగీతం : శ్రీరామ్ మద్దూరి
సినిమాటోగ్రఫీ : రామ్ కె మహేష్
ఎడిటింగ్ : చంద్రశేఖర్ జి.వి

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక లీడ్ రోల్స్‌లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు’ జీ5లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

చిత్తూరు జిల్లాకు చెందిన ప్రసాద్ రావు(రాజీవ్ కనకాల) ఓ కిరాణా కొట్టుతో జీవనం సాగిస్తుంటాడు. ఆయనకు స్వాతి(వసంతిక) అనే కూతురు ఉంటుంది. తమ కుటుంబంలో డిగ్రీ చేసిన తొలి వ్యక్తిగా స్వాతి నిలుస్తుంది. ఆమెకు హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో తొలుత ప్రసాద్ రావు వెళ్లొద్దని అంటాడు. కానీ కుటుంబ సభ్యుల కోరికతో ఆయన అందుకు అంగీకరిస్తాడు. స్వాతితో హైదరాబాద్ వెళ్లి ఆమెకు ఓ హాస్టల్‌లో జాయిన్ చేయిస్తాడు. ఒక నెల రోజుల తర్వాత స్వాతి కనిపించకుండా పోతుంది. మీడియాలో ఈ వార్త సెన్సేషన్‌గా మారుతుంది. పోలీసులు ఈ మిస్సింగ్ కేసును ఎలా ట్రాక్ చేశారనేది ఈ సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ వెబ్ సిరీస్ ద్వారా ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రేక్షకులకు చూపెట్టాలని మేకర్స్ ప్రయత్నించారు. ఆడపిల్లలను ఎలా పెంచాలి, వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను నిశితంగా చూపెట్టారు. అయితే, వారు చెప్పాలనుకున్న మెసేజ్ పూర్తిస్థాయిలో ప్రేక్షకుల్లోకి వెళ్లకపోయినా, ఇలాంటి పాయింట్‌ను వారు అడ్రెస్ చేయడం మెచ్చుకోదగ్గ అంశం.

ఇక రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. రాజీవ్ కనకాల లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తారు. అయితే, ఈ వెబ్ సిరీస్‌లో ఆయన స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ, ఆయన సాలిడ్ ఇంపాక్ట్ చూపెట్టారు.

#90s ఫేం వసంతిక తన పాత్రలో ఇంప్రెస్ చేస్తుంది. ప్రముఖ యాంకర్ ఉదయభాను చాలా రోజుల తర్వాత ఓ చక్కటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పిస్తుంది. ఈ సిరీస్‌లో కొన్ని సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సిరీస్‌లో విలన్ పాత్ర తొలుత బలంగా ఉన్నట్లు అనిపించినా, దాని ముగింపు మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. ఈ పాత్రను సరిగ్గా రాసుకోలేదు అన్నట్లుగా ఉంటుంది. విలన్ పాత్రను ఇంకాస్త ఎలివేట్ చేస్తూ, మరికొన్ని సీన్స్ పెట్టి ఉంటే ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యేవారు.

చివరి ఎపిసోడ్‌లోనే చాలా విషయాలను రివీల్ చేయడం పెద్దగా వర్కవుట్ కాలేదని చెప్పాలి. ఒకేసారి ఇన్ని రివీల్స్ పెట్టడంతో ప్రేక్షకులు డిస్‌కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇన్వెస్టిగేషన్ పోర్షన్ సీన్స్ ఇంకాస్త పవర్‌ఫుల్‌గా రాసుకోవాల్సింది. చాలా రొటీన్‌గా ఇన్వెస్టిగేషన్ సాగినట్లు ప్రేక్షకులకు అనిపిస్తుంది. కొన్ని చోట్ల లాజిక్ కూడా మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఒక చోట ఉదయభాను చెప్పిన డైలాగ్‌ను ఆమెనే ఫాలో కాకపోవడం మెప్పించదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కృష్ణ పోలూరు ఒక చక్కటి పాయింట్‌ను ఎంచుకున్నా, కథనంపై ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉండాల్సింది. కొన్ని సీన్స్ మినహా ఈ సిరీస్‌లోని కంటెంట్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించదు. ఇన్వెస్టిగేషన్ పోర్షన్ సీన్స్, విలన్ పాత్ర ముగింపు వంటి అంశాలపై మరింత ఫోకస్ పెట్టాల్సింది. రామ్ కె మహేష్ సినిమాటోగ్రఫీ, శ్రీరామ్ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గట్టుగా నీట్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే ‘D/o ప్రసాద్ రావు : కనబడుటలేదు’ వెబ్ సిరీస్ ఒక క్రైమ్ థ్రిల్లర్‌గా కొంతవరకే మెప్పించిందని చెప్పాలి. ఒక చక్కటి మెసేజ్ ఉన్నా, ఈ సిరీస్ ఎగ్జిక్యూషన్ ఆకట్టుకోదు. రాజీవ్ కనకాల, వసంతిక, ఉదయభాను తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్, కొన్ని కీలక సన్నివేశాలను హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకోదు. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లను ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్‌ను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు