ఆరోజు తప్పించుకున్న బాలుడే ఇప్పుడు ధనుష్ ?

ఆరోజు తప్పించుకున్న బాలుడే ఇప్పుడు ధనుష్ ?

Published on Jan 6, 2021 1:16 AM IST

danush

డైరెక్టర్ సెల్వ రాఘవన్ తన సూపర్ హిట్ చిత్రం ‘ ఆయిరాతిల్ ఒరువన్’ కు సీక్వెల్ గా ‘ఆయిరాతిల్ ఒరువన్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగంలో కార్తీ కథానాయకుడిగా నటించగా రెండవ భాగంలో ధనుష్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. అయితే ధనుష్ చేయబోయేది మొదటి భాగంలో కార్తీ చేసిన తరహా పాత్ర కాదట. మొదటి భాగంలో కనబడే ఒక పాత్రకు కొనసాగింపట. మొదటి భాగంలో కార్తీ చోళ సామ్రాజ్యానికి చెందిన చివరి వారసుడిని కాపాడతాడు. చోళ రాజుతో సహా అందరూ పాండ్యుల వంశీయుల చేతిలో మరణించగా చిట్టచివరి చోళ వారసుడితో కార్తీ కనుమరుగవుతాడు.

ఇప్పుడు ఆ వారసుడి పాత్రనే ధనుష్ పోషించనున్నాడని తెలుస్తోంది. మొదటి భాగంతో సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసిన సెల్వ రాఘవన్ రెండవ భాగంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం పూర్తవడానికి రెండేళ్లకు పైగానే పడుతుందట. మొదటి భాగాన్ని మించి ఉండబోయే ఈ సినిమాలో సీజీ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. అందుకే ఇంత సమయం తీసుకోనున్నారట టీమ్. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు