తాప్సి యూటర్న్.. ట్రోల్స్ దెబ్బకి తెలుగు సినిమాపై పొగడ్తలు

తాప్సి యూటర్న్.. ట్రోల్స్ దెబ్బకి తెలుగు సినిమాపై పొగడ్తలు

Published on Feb 27, 2026 2:00 AM IST

Taapsee Pannu

మన దక్షిణాది సినిమా నుంచి మంచి పాపులాటీ అంతకు మించి బాగా డబ్బులు కూడా సంపాదించుకొని తర్వాత నార్త్ మార్కెట్ లోకి వెళ్లి మళ్ళీ తెలుగు, ఇతర దక్షిణాది సినిమాలపై కామెంట్స్ చేసిన హీరోయిన్స్ కొందరు ఉన్నారు. ఇలాంటి లిస్ట్ లో ఇటీవల ప్రముఖ హీరోయిన్ తాప్సి పన్ను కూడా చేరింది. తెలుగులో తన మొదటి సినిమా చిత్రం “ఝుమ్మంది నాదం” సినిమాలో వర్క్ ఎక్స్ పీరియన్స్ కోసం బాలీవుడ్ లో మాట్లాడుతూ హేళనగా కామెంట్స్ చేసింది.

దీనితో ఈ కామెంట్స్ పై ఆమెపై సోషల్ మీడియాలో పలు విమర్శలు ట్రోల్స్ కూడా పడ్డాయి. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈమె తెలుగు సినిమాపై పొగడ్తలు కురిపించేస్తుంది. ఇటీవల మరో ఇంటరాక్షన్ లో తనకి పెర్ఫామెన్స్ పరంగా కోలీవుడ్ సినిమా వల్ల పెద్దగా ఒరిగింది ఏమి లేదు కానీ తెలుగు సినిమా వల్ల మాత్రం ఆమెకి ఆదరణ ఎక్కువ వచ్చినట్టు తెలిపినట్టు తెలుస్తుంది.

దీనితో ఆమెపై వస్తున్న విమర్శలపై ఇది నైస్ గా యూటర్న్ తీసుకునే యత్నమే అని చెప్పాలి. జరగాల్సిన డ్యామేజ్ ఎలాగో జరిగింది. ఇప్పుడు మళ్ళీ బుజ్జగింపు మాటలు మాట్లాడినంత మాత్రాన ఆమె మనసులో ఉన్న అభిప్రాయం మారిపోయింది అని ప్రేక్షకులు నమ్ముతారు అనుకుంటే అది అవివేకమే అవుతుంది.

తాజా వార్తలు