అధీరా రోల్ మేకప్ కు అంత సమయమే..?

అధీరా రోల్ మేకప్ కు అంత సమయమే..?

Published on Jan 9, 2021 3:00 PM IST

Sanjay Dutt

ఇప్పుడు అన్ని సినీ ఇండస్ట్రీలలో కూడా పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం మాత్రమే హాట్ టాపిక్ గా నడుస్తుంది. మరి ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ కు ఇంతలా క్రేజ్ రావడనికి ఉన్న అనేక కారణాల్లో అధీరా పాత్ర కూడా ఒకటి. చాప్టర్ 1లో అసలు మొహమే కనిపించకుండా కథకు కీలకంగా అనిపించిన ఈ రోల్ ను సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ను పరిచయం చేసి సెన్సేషన్ ను నమోదు చేశారు.

ఇంకా అలాగే ఫస్ట్ లుక్ లో సంజయ్ మేకోవర్ చూసి కూడా అంతా స్టన్ అయ్యిపోయారు. వి కింగ్స్ వారియర్ రోల్ నుంచి ప్రేరణగా డిజైన్ చేసిన ఈ అధీరా మరింత పవర్ ఫుల్ గా అనిపించాడు. మరి అయితే ఈ రోల్ చూడ్డానికి బాగానే ఉన్నా ఈ రోల్ కోసం సంజయ్ ఏకంగా గంటకు పైగానే మేకప్ వేసుకోవాల్సి వచ్చేది అంట.

ముఖంపై టాటూలు హెయిర్ స్టైల్ అలాగే డ్రెస్సింగ్ అంతటికీ కలిపి తనకి గంటకు పైగానే సమయం తీసుకోవాల్సి వచ్చేది అని తెలుస్తుంది. ఈ చిత్రం నుంచి ఒక పక్క రాకీ భాయ్ రోల్ కోసం అంతా ఎంతలా ఎదురు చూస్తున్నారో అధీరా పాత్ర కోసం కూడా అంతే స్థాయిలో ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఇద్దరి మధ్య భీకర పోరాటాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు