మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకునిగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఉప్పెన”. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా ఇప్పటికే నిలిచింది. మరి ఇదిలా ఉండగా తన మొదటి సినిమా అయ్యినప్పటికీ మంచి అంచనాలనే ఈ చిత్రానికి సెట్ చేసుకున్నాడు.
అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల బ్రేక్ తీసుకొంది. మధ్యలో ఓటిటి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఫైనల్ గా థియేట్రికల్ విడుదలకే రెడీ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్నది ఎవరికీ తెలియరాలేదు. మరి అదేంటో రివీల్ చెయ్యడానికి మేకర్స్ ఇప్పుడు టీజర్ ను వదలడానికి రెడీ అయ్యారు.
మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ను అతి త్వరలోనే విడుదల చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు అనౌన్స్ చేశారు. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీ రోల్ లో నటించాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించాడు.
#UppenaTeaser coming soooon ???????? pic.twitter.com/LoABBO4mY0
— Mythri Movie Makers (@MythriOfficial) January 12, 2021


