`రాధాకృష్ణ`‌ నుండి ఎవ‌డే సాంగ్‌ విడుదల

`రాధాకృష్ణ`‌ నుండి ఎవ‌డే సాంగ్‌ విడుదల

Published on Jan 28, 2021 9:00 AM IST

Yevade song

ప్ర‌ముఖ ద‌ర్శకుడు `ఢ‌మ‌రుకం` ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నఈ చిత్రాన్నిమంతెన న‌ర‌సింహ‌రాజు (చిలుకూరు) స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి5న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌‌టికే విడుద‌లైన పాట‌ల‌కి, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ చిత్రం నుండి `ఎవ‌డే` సాంగ్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌.

`అందాల‌రాముడులాంటి బంగారు బుల్లోడే.. మందారం బుగ్గే మీటి ముద్దాడే సిన్నోడే. ఎవ‌డే నా కోసం వ‌రుడైపుట్టిన వాడు ఎవ‌డే.. నా కోసం ఆశ‌గా వేచిన వాడు ఎవ‌డే..నా క‌థ‌కే నాయ‌కుడ‌య్యే పిల్లాడు..బూచాడు ఎవ‌డే..ఈ బోమ్మ‌కు రంగులు అద్దేవాడు ఎవ‌డే..` అంటూ ఆహ్లాదంగా సాగే ఈ పాటకు చైత‌న్య ప్ర‌సాద్ సాహిత్యం అందించ‌గా లిప్సిక భాష్యం, మోహ‌న‌బోగ‌రాజు అంతే అందంగా ఆల‌పించారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కురాలు ఎం.ఎం.శ్రీ‌లేఖ అద్బుత‌మైన ట్యూన్‌ని కంపోజ్ చేశారు. ఈ పాట‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్ మాట్లాడుతూ – “మా `రాధాకృష్ణ` చిత్రం నుండి ఎం.ఎం. శ్రీలేఖ గారి సంగీత సార‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన అన్ని సాంగ్స్ సూప‌ర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన `ఎవ‌డే` సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఫిబ్ర‌వ‌రి 5న ఈ చిత్రాన్నివ‌రల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

Click Here For Song

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు