‘విశ్వంభర’ అఫీషియల్ క్లారిటీ అప్పుడు తేలిపోతుంది!

‘విశ్వంభర’ అఫీషియల్ క్లారిటీ అప్పుడు తేలిపోతుంది!

Published on Sep 18, 2026 5:11 PM IST

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమాల విషయంలో ఓ రసవత్తరమైన వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది. దర్శకుడు వశిష్ఠతో చేసిన విశ్వంభర ఇంకోపక్క బాబీ కొల్లి తో చేస్తున్న కాకా విడుదల తేదీల మాయాజాలం ఇప్పుడు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మేము వస్తాం అంటే మేమే వస్తున్నాం అని రెండు సినిమా యూనిట్స్ నడుమ ఓ చిన్నపాటి కోల్డ్ వార్ జరుగుతుంది.

అయితే అసలు విశ్వంభర విడుదలపై ఈ దసరా కి ఓ క్లారిటీ వచేస్తుందట. సంక్రాంతి లోనా లేక ఆ తర్వాత వస్తుందా అనే ఓ తుది క్లారిటీ ఈ దసరాకి వచ్చేస్తుంది అని సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం. సో మెగా అభిమానులు మరికొన్ని రోజులు ఓపిక పడితే ఈ ఫాంటసీ వండర్ పై ఓ క్లారిటీ వస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు