ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసమే వెయిటింగ్!

ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసమే వెయిటింగ్!

Published on Jan 29, 2021 9:00 AM IST

Prabhas Nag

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ల కాంబోలో తెరకెక్కించనున్న స్కై ఫై థ్రిల్లర్ చిత్రం కూడా ఒకటి.అయితే ప్రభాస్ చేతిలో ఉన్న అన్ని సినిమాల్లో కన్నా కూడా ఈ సినిమా అంటేనే ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు, అందుకే ఇది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా నిలిచింది.

మరి ఈ భారీ చిత్రంకు సంబంధించి మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెబుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను అయితే ఎక్కడా డిజప్పాయింట్ చేసింది లేదు. అలా ఆ మధ్య దర్శకుడు ఇచ్చిన మాట ప్రకారం రెండు అప్డేట్స్ లో ఒకటి ఈరోజే రానుంది. దీనితో ఆ అప్డేట్ ఏమయ్యి ఉంటుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దీనితో ఇప్పుడు ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ ల పేర్లు కూడా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. మరి నాగ్ అశ్విన్ రివీల్ చేసే ఆ అప్డేట్ ఏంటో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో దీపికా పదుకొనె, అమితాబ్ లు నటిస్తుండగా అశ్వనీదత్ 500 కోట్ల మేర భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు