“ఆచార్య” టీజర్..మెగాస్టార్ మాస్ మీల్స్.!

“ఆచార్య” టీజర్..మెగాస్టార్ మాస్ మీల్స్.!

Published on Jan 29, 2021 4:21 PM IST

AcharyaTeaser

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో ఎట్టకేలకు మేకర్స్ నుంచి ఈ టీజర్ విడుదలయ్యింది. మొదటి నుంచి మేకర్స్ చెబుతున్న ధర్మస్థలి దేవాలయం విజువల్స్ నుంచే స్టార్ట్ చేసి చరణ్ చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.

మరి అప్పుడు మెగాస్టార్ ఎంట్రీ నుంచి మాత్రం టీజర్ మరో లెవెల్లోకి వెళ్లిందని చెప్పాలి. కొరటాల డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్స్ లు వాటిలో మెగాస్టార్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా త్రిశూలం పట్టుకొని ఒక షాట్ లో మెగాస్టార్ విశ్వరూపం కనిపించగా మరో బిట్ లో చిరు గ్రేస్ సూపర్బ్ గా అనిపిస్తుంది. మరి అలాగే చిరు తన చెప్పిన డైలాగ్ లో కొరటాల మార్క్ కనిపిస్తుంది.

మరో ముఖ్యమైన మెన్షన్ ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ లో మణిశర్మ సంగీతం కోసం చాలా మందే ఎదురు చూసి ఉంటారు. కానీ మణిశర్మ కాస్త నిరాశ పరిచారేమో అనిపిస్తుంది. మెగాస్టార్ ఇంట్రో షాట్ లో బాగానే ఉన్నా మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత పవర్ ఫుల్ గా ఉండి ఉంటే బాగుండేది అని ఈ కాంబోపై మినిమమ్ అంచనాలు పెట్టుకున్న వారికి అనిపిస్తుంది.

ఇక అలాగే స్టార్టింగ్ సి జి వర్క్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటే బాగుణ్ణు. కానీ తిఱు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. టీజర్ లో ప్రతీ షాట్ అందంగా పవర్ ఫుల్ గా ఉంది. సో ఓవరాల్ గా మాత్రం మెగా ఫ్యాన్స్ కు ఈ టీజర్ మాస్ మీల్స్ అందించిందని చెప్పాలి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేస్తున్నట్టుగా మరోసారి కన్ఫర్మ్ చేశారు.

టీజర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు