నెంబర్ 1 ట్రెండింగ్ లో మెగాస్టార్ “ఆచార్య”.!

నెంబర్ 1 ట్రెండింగ్ లో మెగాస్టార్ “ఆచార్య”.!

Published on Jan 30, 2021 10:02 AM IST

megastar acharya

మెగా ఫ్యాన్స్ అంతా ఎన్నో రోజులుగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్ “ఆచార్య” నుంచి నిన్ననే విడుదల అయ్యింది. విడుదల కావడంతోనే భారీ రెస్పాన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రికార్డు స్థాయి వ్యూస్ మరియు రికార్డు స్థాయి లైక్స్ తో యూట్యూబ్ లో సెన్సేషన్ ను నమోదు చేసింది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ తో ఇప్పుడు మెగాస్టార్ యూట్యూబ్ నెంబర్ 1 ట్రెండింగ్ లోకి వచ్చేసారు.

కేవలం గంటల్లో 6.3 మిలియన్ వ్యూస్ తో 4 లక్షల 8 వేలకు పైగా లైక్స్ తో ఈ టీజర్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అలాగే దీనితో పాటుగానే నిన్ననే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ లో మరో సరికొత్త ఊపు వచ్చింది. ఈ భారీ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు