ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాను చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లలో “రాధే శ్యామ్”ను ముగించేసి మరో భారీ బడ్జెట్ చిత్రం “సలార్” ను కూడా స్టార్ట్ చేసేసాడు. అయితే వీటితో పాటుగా మరో రెండు భారీ సినిమాలు కూడా ప్రభాస్ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా సాధ్యమైనంత తొందరలోనే ముగించే పనిలో ప్రభాస్ ఉన్నాడు.అయితే మరి ఈ రెండిటి తర్వాత మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ లైన్ లో ఉందని కొన్నాళ్ళు నుంచి గాసిప్స్ వినిపిస్తున్నాయి. అదే బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో. వీరి కాంబోలో సినిమా అయితే ఆల్ మోస్ట్ ఉందని సమాచారం.
అంతే కాకుండా ఈ భారీ చిత్రాన్ని సిద్దార్థ్ మరియు ప్రభాస్ లు చేస్తున్న ప్రస్తుత రెండేసి సినిమాలు పూర్తయ్యాకే పట్టాలెక్కనున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ చిత్రం ఎలా లేదన్నా దాదాపు 2022 ముగింపులో మొదలు కానుందట. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.


