మరో భారీ సీక్వెన్స్ షూట్ లో “RRR”.!

మరో భారీ సీక్వెన్స్ షూట్ లో “RRR”.!

Published on Jan 30, 2021 1:00 PM IST

rrr

ఇప్పుడు మన ఇండియన్ బాక్సాఫీస్ మీదకు రావడానికి రెడీగా ఉన్న ప్రిస్టేజియస్ భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. ఒక్కో అనౌన్సమెంట్ తో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. లేటెస్ట్ గా మేకర్స్ తాము చేస్తున్న మరో భారీ సీక్వెన్స్ గ్లింప్స్ ను షేర్ చేశారు.

మొత్తం బ్లూ మాట్స్ లో పెద్ద ఎత్తున లైటింగ్ మరియు ఎయిర్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నట్టుగా చూపించారు. చూడ్డానికి ఓ సరైన యాక్షన్ సీక్వెన్స్ లానే ఇది అనిపిస్తుంది. మరి ఇది సినిమాలో ఎలాంటి సీన్ అన్నది చూడాలి. మరి ఈ భారీ చిత్రంలో ఆలియా భట్, అజయ్ దేవ్ గన్, సముథ్రఖని తదితర స్టార్ అండ్ టాలెంటెడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని 400 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు