‘వారణాసి’ కూడా అయిపోవస్తుంది.. మరి ‘ఫౌజీ’?

‘వారణాసి’ కూడా అయిపోవస్తుంది.. మరి ‘ఫౌజీ’?

Published on Sep 19, 2026 9:35 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రానున్న పలు క్రేజీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళిల వారణాసి అలానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడిల ఫౌజీ కూడా ఒకటి. అయితే ఈ రెండు సినిమాలూ ఎంతో ప్రతిష్టాత్మకమైనవే.. అయితే ఇంట్రెస్టింగ్ గా ఫౌజీ కంటే ముందే వారణాసి సినిమా పూర్తి కావస్తుండడం విశేషం.

వారణాసి చిత్రం గత ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైతే ప్రభాస్ సినిమా మాత్రం దానికి ఓ ఆరేడు నెలలు ముందే మొదలైంది. కానీ సీన్ కట్ చేస్తే అక్టోబర్ లో వారణాసి పూర్తి అయిపోతుంది కానీ ‘ఫౌజీ’ ఎప్పుడు పూర్తవుతుంది అనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. టాకీ పార్ట్ మాత్రం హను రాఘవపూడి చాలానే చేస్తున్నారట. సో అందుకే సమయం కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇంకోపక్క ఫౌజీ వాయిదా రూమర్స్ కూడా ఊపందుకుంటున్నాయి. సో వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు