బాలయ్య సినిమాలో నాగశౌర్య ?

బాలయ్య సినిమాలో నాగశౌర్య ?

Published on Jan 30, 2021 3:00 PM IST

Naga Shourya1

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమా నుండి ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో నాగశౌర్య ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడని.. నాగశౌర్య పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. పోలీస్ ఆఫీసర్ గా నాగశౌర్య కనిపిస్తాడని తెలుస్తోంది.

అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గానూ ఉంటుందని ఇప్పటికే బోయపాటి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు