“వకీల్ సాబ్” పై ఓ విధంగా ఫ్యాన్స్ కే డౌట్ వస్తుంది.!

“వకీల్ సాబ్” పై ఓ విధంగా ఫ్యాన్స్ కే డౌట్ వస్తుంది.!

Published on Jan 31, 2021 1:02 PM IST

Vakeel Saab 3

అప్పుడెప్పుడో “అజ్ఞ్యాతవాసి” సినిమా తర్వాత అనుకొనో అనుకోకుండానో చాలానే బ్రేక్ తీసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీనితో ఎట్టకేలకు మళ్ళీ పవన్ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తీస్తున్న సంగతి తెలిసిందే.

కానీ ఈ సినిమాను మాత్రం చాలా వరకు మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసేసారు. సరే ఇది బాగున్నా ఇప్పుడు అభిమానులే ఒకింత అనుమానం పడుతున్నారు. అస్సలు ఇది పింక్ రీమేక్ సినిమానేనా అని.. ఎందుకంటే మెయిన్ ప్లాట్ ప్రకారం మెయిన్ లీడ్ పవన్ కళ్యాణ్ అయినప్పటికీ అసలు కథ అంతా ఈ సినిమాలోని కీలక పాత్రలు అయినటువంటి మహిళా పాత్రలు చుట్టూ తిరుగుతుంది.

వారితో పాటుగా లాయర్ అయినటువంటి మేల్ లీడ్ ను ఇది వరకు తమిళ్ మరియు హిందీ పోస్టర్స్ లో హైలైట్ చేశారు. కానీ “వకీల్ సాబ్”కు మాత్రం ఇప్పటి వరకు ఒక్క పోస్టర్ లో కూడా నివేతా థామస్ మరియు అంజలీల ఫోటోలు కనిపించింది లేదు. దీనితో క్రిటిక్స్ అనేవి ఏమో కానీ ఒకింత పవన్ ఫ్యాన్సే డౌట్ పడుతున్నారు. మరి దిల్ రాజు అండ్ కో ఇక ముందు నుంచి అయినా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు