ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల రిలీజ్ డేట్లును వరుసగా ఎనౌన్స్ చేస్తున్నారు. బాలయ్య బాబు బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ శరవేగంగా జరుతోన్న సంగతి తెలిసిందే. అలాగే, రవితేజ ఖిలాడి సినిమా చేస్తున్నాడు. కాగా బాలకృష్ణ, రవితేజ సినిమాలు పోటీ పడబోతున్నాయి. ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను మే 28న రిలీజ్ చేయబోతున్నట్టు కొన్ని రోజుల కిందట ప్రకటించాడు. ఇప్పుడు అదే తేదీని తాపీగా బాలకృష్ణ కూడా ప్రకటించాడు.
నట సింహం బాలయ్య బాబు బోయపాటి సినిమా రిలీజ్ డేట్ ను నిన్న అధికారికంగా మే 28 అని అనౌన్స్ చేసారు. త్వరలోనే ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. కాగా బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సారి రవితేజ – బాలయ్య ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.


