ఆచార్య కోసం చరణ్ – చిరు రెడీ !

ఆచార్య కోసం చరణ్ – చిరు రెడీ !

Published on Feb 1, 2021 3:00 PM IST

chiru ram chran

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న ‘ఆచార్య’ సినిమాలో చరణ్ – చిరు కాంబినేషన్ సిన్స్ ను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ వేశారని.. వచ్చే వారం నుండి ఆ సెట్ లో షూట్ చేయబోతున్నారని తెలస్తోంది. ఇక ఈ ‘ఆచార్య’ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా రాబోతున్నాడు.

కాగా మెగాస్టార్ ను ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా కొరటాల ఈ సినిమాలో చూపించబోతున్నాడనగానే మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పైగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. ఆమె ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటిస్తోందని తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడట. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు