ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో పాటుగా పాలిటిక్స్ లో కూడా బిజీగా నడుస్తున్నారు. మరి ఇదిలా ఉండగా పవన్ చేస్తున్న అన్ని సినిమాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో భారీ పీరియాడిక్ చిత్రం కోసం కాస్త పవన్ ఫ్యాన్స్ ఎక్కువగానే ఎదురు చూస్తున్నారు. దీనితో ఇది పవన్ చేస్తున్న అన్ని సినిమాల్లోనూ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమాకు మాత్రం ఎప్పటి నుంచో టైటిల్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పటికే చాలానే టైటిల్స్ పరిగణలోకి వచ్చాయి కానీ ఏదీ ఫైనల్ కాలేదు. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం మేకర్స్ “హరి హర వీర మల్లు” అనే టైటిల్ ను లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ ను ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.


