
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు కుమారుడు, హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ కు చెందిన దీపికను సుమంత్ అశ్విన్ వివాహమాడనున్నాడు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్లోనే జరగనుంది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. ఇండస్ట్రీ నుండి కొద్దిమంది మిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
‘తూనీగ తూనీగ’ సినిమాగా హీరోగా పరిచయమైన సుమంత్ అశ్విన్ ‘అంతకు ముందు ఆ తర్వాత, కేరింత, లవర్స్’ లాంటి సినిమాలతో మెప్పించాడు. ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి ‘ఇదే మా కథ’లో నటిస్తున్నాడు. ‘ఒక్కడు, నువ్విస్తానంటే నేనొద్దంటానా, వర్షం, మనసంతా నువ్వే’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు నిర్మించిన ఎం. ఎస్.రాజు ఇటీవలే ‘డర్టీ హరి’ చిత్రంతో దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు.

