
నితిన్ చేస్తున్న కొత్త చిత్రం ‘చెక్’. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. జైలులో ఖైదీలా ఇరుక్కున్న హీరో, అతనిపై టెర్రరిస్ట్ అనే ముద్ర, కానీ చంద్రంగం ఆటలో మాత్రం అతనొక జీనియస్. అలాంటి వ్యక్తి తనకు ఎదురైన ఆపద నుండి ఎలా తప్పించుకున్నాడు అనేదే ఈ సినిమా. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ రిలీజ్ చేశారు టీమ్.
ట్రైలర్లో కథలోని పాత్రలను చందరంగం ఆటలోని పావులతో పోల్చారు. ఏనుగు, ఒంటె అంటూ కథానాయకుడి ప్రత్యర్థులను పరిచయం చేస్తే కథానాయకుడ్ని మాత్రం సైనికుడిలా పరిచయం చేసి అసలు యుద్దాన్ని మొదలుపెట్టేదే సైనికుడు అంటూ పాత్రకు గొప్ప ఎలివేషన్ ఇచ్చారు డైరెక్టర్. సినిమా చాలావరకు జైలు, కోర్టు, చందరంగం ఆట చుట్టూనే జరుగుతోంది. ఇక హీరోను నిర్దోషి అని నమ్మి బయటకు తీసుకురావాలని లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చేసే ప్రయత్నాలు. ఇవి మొత్తంగా ట్రైలర్లో చూపించిన అంశాలు. ఇందులో థ్రిల్లింగ్ మూమెంట్స్ చూస్తే సినిమా కూడ చదరంగం ఆటలానే థ్రిల్లింగానే ఉంటుందని అనిపిస్తోంది. ట్రైలర్ అయితే సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేసిందనే అనాలి. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 19న రిలీజ్ కానుంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

