స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో విజయ్ బాక్సాఫీస్ స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులో కూడ సినిమా మంచి సక్సెస్ సాధించింది. తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల్ని అందించింది. ఈ విజయంతో విజయ్ తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ గతంలో ‘కోలమవు కోకిల’ సినిమానౌ డైరెక్ట్ చేయగా ఆయన కొత్త చిత్రం ‘డాక్టర్’ త్వరలోనే రిలీజ్ కానుంది. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ‘డాక్టర్’ చివరి దశ పనుల్లో ఉంది. దీంతో నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ సినిమా పనుల్ని స్టార్ట్ చేశారట. ఏప్రిల్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుపెడతారని తెలుస్తోంది. సం పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయకిగా పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉంది. ఈ భారీ బడ్జెట్ సినిమాకు అనిరుద్ సంగీతం అందివ్వనుండగా మనోజ్ పరమహంస డీవోపీ చేయనున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.


