రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో ఫుల్ అంచనాలు ఉన్నాయి. అయితే రాజమౌళి తరువాత సినిమా పై కూడా అప్పుడే అనేక ఊహాగానాలు మొదలైపోయాయి. ఇప్పటికే రాజమౌళి తన నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడని, ఆ మధ్యే జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక అప్పటి నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో రూమర్ ఒకటి ఈ సినిమా గురించి బాగా వినిపిస్తోంది.
ఈ సినిమా కూడా మల్టీస్టారర్ అని తెలుస్తోంది. పైగా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందట ఈ సినిమా. మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.


