తన సెన్సేషనల్ డైరెక్టర్ తో మరోసారి మాస్ మహారాజ్.?

తన సెన్సేషనల్ డైరెక్టర్ తో మరోసారి మాస్ మహారాజ్.?

Published on Feb 7, 2021 7:00 PM IST

raviteja

మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది తన సినిమాతోనే టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ శుభారంభాన్ని అందించారు. తన హ్యాట్రిక్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో “క్రాక్” అనే పవర్ ఫుల్ పోలీస్ డ్రామా తీసి అదిరిపోయే కం బ్యాక్ కొట్టి భారీ తన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా అందులోనూ 50 శాతం సీటింగ్ తోనే నిలబెట్టారు.

మరి ఇదే హ్యాట్రిక్ కాంబో అనుకుంటే మాస్ మహారాజ్ మరో డబుల్ హ్యాట్రిక్ దర్శకుడు కూడా ఉన్నాడుగా..అదే పూరి జగన్నాథ్. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు తెలుగు ఆడియెన్స్ అంత సులభంగా మర్చిపోరు. మరి అలాంటి ఈ కాంబో నుంచి మరో సినిమా ఉండనున్నట్టుగా ఊహాగానాలు ఇపుడు వినిపిస్తున్నాయి.

రీసెంట్ గానే ఈ ఇద్దరి మధ్య ఒక స్క్రిప్ట్ కోసం చర్చ జరిగింది అని తెలుస్తుంది. మరి ఒకవేళ ఈ కాంబో నుంచి మళ్ళీ ఓ సినిమా పడితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మరో లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి ఇక.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు