ఈ అంశంలో మహేష్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా?

ఈ అంశంలో మహేష్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా?

Published on Feb 12, 2021 5:39 PM IST

Mahesh 1

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం షూట్ ఇప్పుడు దుబాయ్ లో శరవేగంగా జరుగుతుంది. మరి అలాగే ఇదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ వర్క్ కూడా అంతే జెట్ స్పీడ్ తో అవుతుంది అని ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ ఎప్పటికప్పుడు చెబుతున్నాడు.

అయితే గత కొన్ని రోజుల కితమే ఈ సినిమా ఆల్బమ్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో దర్శకుడు పరశురామ్ పెట్ల మరింత కేర్ తీసుకుంటున్నారని తెలిపారు.అయితే మరి ఇదే విషయంలో మహేష్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమా ఆల్బమ్ అదిరిపోవాలని మహేష్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఈ కాంబో నుంచి ఒక సాలిడ్ ఆల్బమ్ రావడం ఖాయం లానే ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిమిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు