
వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడు ‘నారా రోహిత్’ తన కొత్త సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడట. పొడవాటి వైట్ గడ్డంతో రోహిత్ చాల కొత్తగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అన్నట్లు రోహిత్ తన తరువాత చిత్రాన్ని బాణం చిత్రం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రం అట. ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట.
ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నారట. దర్శకుడిగా చెైతన్య దంతులూరి తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతోనే చెైతన్య మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేశాడు. అయినా చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. మరి ఈ సారైనా హిట్ కొడతాడేమో చూడాలి.

