
బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఇప్పటికే మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రానున్న సినిమాలో కూడా మెయిన్ విలన్ గా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సినిమాలో సీనియర్ బాలయ్యకు విలన్ పాత్ర ఉందని.. ఈ పాత్రలో సునీల్ శెట్టిను తీసుకున్నారట. అయితే సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కేవలం రెండు సీన్స్ లో మాత్రమే ఉంటాడని.. ఆ క్యారెక్టర్ కి విలన్ గా ప్లాష్ బ్యాక్ లో సునీల్ శెట్టి కనిపిస్తున్నాడని తెలుస్తోంది.
మరి సునీల్ శెట్టి, బాలయ్య సినిమాలో ఏ లుక్స్ లో కనిపించబోతున్నాడో.. ఎలాంటి పాత్ర చేయబోతున్నాడో చూడాలి. ఈ మూవీకి సంబంధించిన ఒక యాక్షన్ షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేశారు. త్వరలో జరిగే షూట్ లో హీరోయిన్ పార్ట్ కు సంబంధించిన సీన్స్ ను బోయపాటి షూట్ ప్లాన్ చేస్తున్నాడట. ఏమైనా బాలయ్యకి విలన్ సమస్య ప్రతి సినిమాకి ఉంటూ వస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

