చరణ్ సినిమాలపై ఆగని రూమర్స్.!

చరణ్ సినిమాలపై ఆగని రూమర్స్.!

Published on Feb 14, 2021 11:07 PM IST


ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి దర్శక ధీరుడు రాజమౌళి తో తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం” కాగా మరొకటి కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరుతో తీస్తున్న “ఆచార్య”. ఈ రెండిటిలో కూడా సాలిడ్ రోల్స్ నే చరణ్ చేస్తున్నాడు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం అనంతరం ఏకంగా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో మరో సినిమాను అనౌన్స్ చేసేసాడు. మరి ఇది ఇంకా లైన్ లో ఉండగానే మరో ఆసక్తికర బడా ప్రాజెక్ట్ చరణ్ చెయ్యబోతున్నాడని మరిన్ని రూమర్స్ గుప్పుమంటున్నాయి.

వాటిలో గౌతమ్ తిన్ననూరి పేరుతో పాటుగా మరొక స్టార్ దర్శకుడు కూడా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఇపుడు రామ్ చరణ్ 16వ సినిమా కూడా మంచి హాట్ టాపిక్ అవుతుంది. ఇక దీనిపై ఎప్పుడు క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

తాజా వార్తలు