‘మ‌యూరాక్షి’ ఆడియో విడుదల

‘మ‌యూరాక్షి’ ఆడియో విడుదల

Published on Feb 15, 2021 10:00 AM IST

Mayuraakshi

భాగ‌మ‌తి, జనతా గ్యారేజ్ ఫేం ఉన్ని ముకుంద‌న్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా మ‌ల‌యాళంలో రూపొందిన `ఐరా` చిత్రాన్ని `మ‌యూరాక్షి` పేరుతో శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై తెలుగులోకి అనువ‌దిస్తున్నారు యువ నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్. సూప‌ర్ హిట్ చిత్రాల సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్రలోని పాట‌లు ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్ర‌ముఖ నిర్మాతలు కె.అచ్చిరెడ్డి, శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ బిగ్ సీడీని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ…“ అనువాద చిత్రానికి తెలుగుద‌నంతో కూడిన మ‌యూరాక్షి` అనే టైటిల్ పెట్ట‌డంలోనే నిర్మాత యొక్క అభిరుచి ఏంటో తెలుస్తుంది. ఇక గోపీ సుంద‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న తెలుగులో చేసిన ఎన్నో చిత్రాలు స‌క్సెస్ సాధించాయి. ఈ సినిమా పాట‌లు కూడా విన్నాం, చూశాం.. ఎంతో మెలోడియ‌స్ గా ఉన్నాయి. ట్రైల‌ర్ చూడ‌గానే సినిమా చూడాల‌న్ని క్యూరియాసిటీ క‌లిగింది. ఉన్ని ముకుంద‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో సుప‌రిచిత‌మైన హీరో. మిస్ట‌రీతో కూడిన ఈ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ఎప్పుడూ ఆద‌ర‌ణ ఉంటూనే ఉంటుంది..ఈ సినిమా కూడా విజ‌యం సాధించి యువ నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్ కు మంచి పేరు తేవాల‌ని“ అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ…“పాట‌లు, ట్రైల‌ర్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. థ్రిల్ల‌ర్ చిత్రాలను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉంటారు. ఆ కోవ‌లో ఈ చిత్రం కూడా పెద్ద స‌క్సెస్ సాధించి నిర్మాత‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ…`గోపీసుంద‌ర్ మ్యూజిక్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో ఆయ‌న ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇందులో కూడా రెండు అద్భుత‌మైన సాంగ్స్ ఉన్నాయి. ట్రైల‌ర్ ,టైటిల్ రెండూ ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయి. మార్చి 19న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాని కోరుకుంటూ యంగ్ ప్రొడ్యూస‌ర్ జ‌యంత్ కుమార్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా“ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు