10 ఏళ్ల తర్వాత ప్రభాస్ టచ్ చేశాడు.. రిజల్ట్ ఎలా ఉంటుందో ?

10 ఏళ్ల తర్వాత ప్రభాస్ టచ్ చేశాడు.. రిజల్ట్ ఎలా ఉంటుందో ?

Published on Feb 15, 2021 10:10 PM IST

prabhas 9

అప్పటివరకు మాస్ మసాలా సినిమాలతో సాగిపోతున్న ప్రభాస్ సినీ కెరీర్ కు రొమాంటిక్ టర్న్ ఇచ్చిన సినిమాలు ‘డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాలు. 2010, 2011లో బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆరడుగుల ప్రభాస్ కటౌట్లో యాక్షన్ కంటెంట్ మాత్రమే కాదు రొమాంటిక్ పాళ్ళు కూడ మెండుగా ఉన్నాయని ప్రూవ్ చేశాయి. సినిమాలు రెండూ మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే ఆయన్నుండి అలాంటి రొమాంటిక్ ఎంటెర్టైనర్లు తరచూ వస్తే చూడాలని ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకుంటుంటారు.

కానీ ఆ సినిమాల తరవాత ప్రభాస్ మళ్ళీ మాస్ సినిమాల బాట పట్టారు. అలా పదేళ్లు ఆ సినిమాలతోనే గడిపి పాన్ ఇండియా స్టార్ అయిన డార్లింగ్ మరోసారి ‘రాధేశ్యామ్’ రూపంలో రొమాంటిక్ జానర్ టచ్ చేశారు. అంటే దశాబ్దం తర్వాత ప్రభాస్ చేస్తున్న ఫుల్ లెంగ్త్ లవ్ ఎంటర్టైనర్ ఇదే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 14 సందర్బంగా విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన రొమాంటిక్ మ్యాజిక్ రిపీట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు