భారీ బడ్జెట్ “బ్ర‌హ్మాస్త్ర”లో నాగ్ రోల్ కంప్లీటెడ్!

భారీ బడ్జెట్ “బ్ర‌హ్మాస్త్ర”లో నాగ్ రోల్ కంప్లీటెడ్!

Published on Feb 16, 2021 11:02 AM IST

Brahmastra

మన టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున పలు ఆసక్తికర చిత్రాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “బ్రహ్మాస్త్ర” కూడా ఒకటి‌. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ రూపొందిస్తున్న ఈ మోస్ట్ ఎవేటింగ్ సినిమాలో కింగ్ నాగార్జున న‌టిస్తున్నారు. అయితే తాజాగా కింగ్ నాగార్జున‌కి సంబంధించిన షూటింగ్ ముగిసిన‌ట్లుగా బ్ర‌హ్మ‌స్త్ర టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని కింగ్ నాగార్జున త‌న అఫీషియల్ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.

బ్ర‌హ్మాస్త్ర వంటి ఇండియాలోనే అతి భారీ బ‌డ్జెట్ సినిమాలో న‌టించ‌డం త‌నకు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని, ఓ సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుడి మాదిరిగా తాను కూడా ఈ సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తున్న‌ట్లుగా నాగ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఇక ఈ భారీ సినిమాలో నాగార్జునతో పాటు బాలీవుడ్ డ్రీమ్ బాయ్ ర‌ణ‌బీర్ కపూర్, డ్రీమ్ గర్ల్ అలీయ‌భ‌ట్ న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం బాంబే ఓ భారీ సెట్ లో న‌డుస్తోంది. ఈ చిత్రానికి గనుఁ మేకర్స్ 150 కోట్లకు పైగా వ్యయం వెచ్చిస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు