శిష్యుడికి ‘ఉప్పెన’ అంత ప్రేమతో సుకుమార్

శిష్యుడికి ‘ఉప్పెన’ అంత ప్రేమతో సుకుమార్

Published on Feb 17, 2021 3:00 AM IST

sukumar

దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్నారు. అయితే ఆ విజయం ఆయన సినిమాది కాదు. తన శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ‘ఉప్పెన’ సినిమాది. సుకుమార్ వద్ద చాలాకాలం దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సాన మొదటి సినిమా ఇది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. మొదటి నుండి ఈ సినిమా వెనుక వెన్నెముకలా నిలిచారు సుకుమార్. బుచ్చిబాబు కంటే ఎక్కువగానే సినిమాను నమ్మారు. అందుకే విజయాన్ని అంతగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో బుచ్చిబాబు మీద ప్రశంసలు కురిపించిన సుకుమార్ తాజాగా తన ప్రేమను కవిత రూపంలో వ్యక్తపరిచారు.

‘నువ్వు నన్ను గురువును చేసే సరికి… నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా…?? అని.. నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా’నా’ బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు – సుకుమార్’ అంటూ చాలా హృద్యమైన కవితను రాశారు. సుకుమార్ ఎంతో భావోద్వేగానికి గురైతే తప్ప కవితలు రాయరు. ఒకవేళ రాసినా పెద్దగా బయటపెట్టరు. అలాంటిది బుచ్చిబాబు మీద కవిత రాసి దాన్ని ఎంతో ముచ్చటతో ప్రేక్షకుల ముందు పెట్టారు అంటే శిష్యుడి విషయంలో ఆయనెంత ఆనందంగా, గర్వంగా ఉన్నారో తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు