అభిమానులకు నిధి అగర్వాల్ రిక్వెస్ట్

అభిమానులకు నిధి అగర్వాల్ రిక్వెస్ట్

Published on Feb 18, 2021 12:20 AM IST

Nidhhi Agerwal2
ఇటీవల ప్రేమికుల రోజు సందర్బంగా హీరోయిన్ నిధి అగర్వాల్ కు గుడి పట్టి పాలాభిషేకాలు చేశారు కొందరు హార్డ్ కోర్ అభిమానులు. తమిళనాడులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పాలాభిషేకాలు కాదు సామాజిక సేవా కార్యక్రమాలను కూడ నిర్వహించారు. ఇలా తన కోసం ఏకంగా గుడి కట్టి పూజలు చేయడం చూసి నిధి సైతం షాకైంది. ప్రేక్షకుల్ అభిమానానికి పొంగిపోయింది.

తాజాగా గుడి కట్టిన అభిమానులకు ఆమె ఇక రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ గుడిని ఆశ్రయం ఇవ్వడం, ఆకలి తీర్చడం, విద్యను అందిచడం లనఁటి సేవా కార్యక్రమాలకు వేదికగా చేసుకోవాలని ట్రస్టీలను ఆమె కోరారు. అంతేకాదు ఇలాంటి అభిమానులు ఉన్నందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నానాని కూడ అన్నారు. ఇటీవలే నిధి అగర్వాల్ నటించిన తమిళ చిత్రాలు ‘భూమి, ఈశ్వరన్’ సినిమాలు విడుదలకాగా తెలుగులో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది ఆమె.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు