సాలిడ్ యాక్షన్ మోడ్ లో చరణ్.?

సాలిడ్ యాక్షన్ మోడ్ లో చరణ్.?

Published on Feb 18, 2021 6:00 PM IST

ramcharan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న “ఆచార్య” కూడా ఒకటి. ఇందులో సిద్ద అనే సాలిడ్ రోల్ ను కొరటాల డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. జస్ట్ ప్రీ లుక్ తోనే మంచి హైప్ తెచ్చిన ఈ రోల్ కు సంబంధించి షూట్ లో కూడా ఇప్పుడు చరణ్ పాల్గొంటున్నాడు.

అయితే ఇప్పుడు మేకర్స్ “పుష్ప” లొకేషన్స్ మారేడుమిల్లిలో ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లో చరణ్ ఉన్నట్టుగా సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.. నిన్ననే చరణ్ “ఉప్పెన” సక్సెస్ మీట్ లో కనిపించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ వార్త వినడంతో మెగా ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు