చరణ్ – శంకర్ ప్రాజెక్ట్ బడ్జెట్ పై ఆసక్తికర బజ్.!

చరణ్ – శంకర్ ప్రాజెక్ట్ బడ్జెట్ పై ఆసక్తికర బజ్.!

Published on Feb 18, 2021 8:19 PM IST

ram charan shankar
లేటెస్ట్ గా ఇండియన్ వైడ్ సెన్సేషన్ రేపిన భారీ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ ల ప్రాజెక్ట్ అనే చెప్పాలి. దీనికి ముందు చాలానే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి కానీ ఎందుకో దీనికి సెపరేట్ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా చరణ్ కు మరియు శంకర్ కు 15వ సినిమా కావడం దిల్ రాజుకు 50 వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యిన దగ్గర నుంచి బడ్జెట్ కోసం హాట్ టాపిక్ గా అవుతూ వచ్చింది.

మినిమం ఎలా లేదన్నా 200 కోట్లు ఆల్రెడీ ఎస్టిమేట్ అందరు వేసుకున్నారు. కానీ ఇదే బడ్జెట్ విషయంలో మరో ఆసక్తికర బజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. శంకర్ దిల్ రాజుకు ఆల్రెడీ ఓ ఫిగర్ బడ్జెట్ చెప్పగా దానికి దిల్ రాజు ఓకే అన్నారట కానీ అక్కడితో మాత్రమే సినిమా పూర్తవ్వాలి కానీ అంతకు మించి పెరిగే వీలు లేదని అగ్రిమెంట్ చేసుకున్నారట. దానికి శంకర్ కూడా ఒప్పుకొని ఓకే చేసినట్టు తెలుస్తుంది. మరి ఫైనల్ గా ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెడుతున్నారో అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు