యాంక‌ర్ ర‌వి ‘తోట‌బావి’ సెన్సార్ పూర్తి, విడుదల తేదీ ఖరారు

యాంక‌ర్ ర‌వి ‘తోట‌బావి’ సెన్సార్ పూర్తి, విడుదల తేదీ ఖరారు

Published on Feb 20, 2021 5:04 PM IST

thota bavi

అంజి దేవండ్ల ద‌ర్శ‌క‌త్వం లో, యాంకర్ రవి హీరో గా నటిస్తున్న చిత్రం ‘తోట‌బావి’. గౌత‌మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ , దౌలు(విష్ణుప్రియహోట‌ల్) చిన్న స్వామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభినేష్. బి స‌హ‌నిర్మాత‌. ఇటీవలే ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేయగా టీజర్ కి మంచి స్పందన లభించింది. అంతకుముందు వచ్చిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మేము అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చింది సినిమా. సెన్సార్ చేసిన సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. హీరో ర‌వి గారి నటనను ప్రసంశించారు. ముందునుంచి రవిగారు ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేను. యాక్షన్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో థ్రిల్ చేయడానికి ఈ మార్చి 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం.. అన్నారు.
నిర్మాతలు ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ , దౌలు చిన్న స్వామి, అభినేష్. బి మాట్లాడుతూ మార్చి 5 న రాబోతున్న ఈ సినిమా ని ప్రేక్షకులను ఆదరించాలి.. సినిమా ఆద్యంతం అలరిస్తుంది. సెన్సార్ సభ్యులు కూడా సినిమా బాగుందని ప్రశంసించారు. డైరెక్టర్ మా నమ్మకాన్ని నిలబెట్టాడు.. ఏదైతే చెప్పాడే అంతకుమించి తెరకెక్కించాడు. హీరో రవి గారు చాల బాగా నటించారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా రవిగారిని ఈ సినిమాలో చూపించబోతున్నాం..ఈ సినిమా చూసి అందరు తప్పకుండ థ్రిల్ ఫీల్ అవుతారు అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు