ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళితో మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ భారీ చిత్రం అనంతరం తనకు మరింత దగ్గరైన మరో దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్లాన్ చేసిన సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర వార్తలే ఈ మధ్యన వినిపిస్తూ వస్తున్నాయి.
అలా హీరోయిన్ నుంచి ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ వరకు టాక్ వస్తుంది. త్రివిక్రమ్ దృష్టిలో ప్రముఖ సినిమాటోగ్రఫర్ జి కె విష్ణు పేరు పడినట్టుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తనకు తీసిన గత చిత్రాలు “మెర్సల్” మరియు లేటెస్ట్ సెన్సేషన్ “క్రాక్” సినిమాటోగ్రఫీలకు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. మరి ఇతని పేరు ఇప్పుడు ఈ చిత్రానికి అనుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.


