
యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారట. తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో గోపీచంద్ ‘ఒక హీరో’గా చేస్తోన్న మొదటి సినిమా ఇది.
కాగా తేజ, గోపీచంద్ ఓ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను చేస్తున్నాడని.. ముఖ్యంగా తేజ ఓ వైవిధ్యమైన నేపథ్యంతో విభిన్నమైన కథని రాశాడని తెలుస్తోంది. అయితే ఇంతకీ అలిమేలు మంగ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ? ఇప్పటికే హీరోయిన్ కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని తేజ పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను తేజ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది.

