ఈ సారి “బిగ్ బాస్”లో ఈ డోస్ ఎక్కువే అట.!

ఈ సారి “బిగ్ బాస్”లో ఈ డోస్ ఎక్కువే అట.!

Published on Mar 10, 2021 5:30 PM IST

BigBoss

మన తెలుగులోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది “బిగ్ బాస్” అనే చెప్పాలి. మన ఇండియాలో అయితే తెలుగు బిగ్ బాస్ షో సెట్ చేస్తున్న రికార్డులు ఎవరూ టచ్ చెయ్యని రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ గ్రాండ్ షో ఇప్పుడు ఐదో సీజన్ కు రెడీ అవుతుంది.

గత ఏడాది అంటే కరోనా వల్ల లేట్ అయ్యింది కానీ ఈసారి మాత్రం ఎలాంటి లేట్ లేకుండా అదరగొట్టాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సీజన్ కు సంబంధించి మరిన్ని ఆసక్తికర టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సారి మరింత మంది నోటెడ్ స్టార్స్ ను తీసుకురానున్నారని అలాగే ఫిమేల్ కంటెస్టెంట్స్ లో జాగ్రత్త తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీనితో గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే కనిపిస్తుందని తెలుస్తుంది. మరి అలాగే ఈ సీజన్ ను మేకర్స్ వచ్చే జూన్ నుంచి ఆరంభించనున్నట్టు వినికిడి. మరి ఈ సారి సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు