సూపర్ స్టార్ రజనీకాంత్ – యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తున్న రజిని 168వ సినిమా షూటింగ్ కి రజిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ముందుగా రజిని – కీర్తి సురేష్ పై కొన్ని సీన్స్ తీయబోతునట్లు తెలుస్తోంది. ఈ సీన్స్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వస్తాయట. అన్నట్టు ఈ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతుందట. ఆ తరువాత రజిని – ఖుష్బూ కలయికలో వచ్చే ఫ్యామిలీ సీన్స్ తీస్తారని తెలుస్తోంది.
కాగా ఖుష్బూ ఈ సినిమా కోసం బరువు తగ్గి సరికొత్తగా రెడీ అయింది. రజిని సర్ కాబట్టే.. ఈ సినిమా చేస్తున్నాను. అలాగే నా పాత్ర కూడా నాకు కొత్తగా అనిపించింది. ఇక రజిని సర్ నాకు మధ్య కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి. కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాయి’ అని ఖుష్బూ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రజనీ – ఖుష్బూలది హిట్ కాంబినేషన్. గతంలో రజనీ, ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి సినిమాల్లో కలిసి చేశారు. మళ్లీ చాలా సంవత్సరాలు తరువాత ఇప్పుడు కలిసి నటిస్తున్నారు.


