పూజా హెగ్డే ఆశపడింది.. సైకిల్ ముంబై వెళ్ళిపోయింది

పూజా హెగ్డే ఆశపడింది.. సైకిల్ ముంబై వెళ్ళిపోయింది

Published on Mar 18, 2021 1:13 AM IST

Pooja

స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒక్కోసారి షూటింగ్ లొకేషన్లో తాము వాడిన వస్తువులు, బట్టల మీద మనసు పడుతుంటారు. కానీ వాటిని తమతో పాటే తీసుకెళ్ళలేరు. ఎందుకంటే అవి ప్రొడక్షన్ ప్రాపర్టీస్ కాబట్టి. ఎంత వాడిన, ఎంత చూసినా సెట్ వరకే పరిమితం. అలా కొన్ని సందర్భాల్లో సినిమాల్లో వాడిన, తమ మనసుకు నచ్చిన వస్తువులను అయిష్టంగానే వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. అలా అయిష్టంగానే వదిలేసిన వస్తువులు వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరకే వెళితే. థ్రిల్లింగా ఉంటుంది కదూ.

ఇలాంటి థ్రిల్లే పూజా హెగ్డేకు కలిగింది. పూజా హెగ్డేకు ‘అల వైకుంఠపురములో’ చిత్రం కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్. ఆ సినిమా చిత్రీకరణను ఆమె చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. షూటింగ్లో ఆమెకు బాగా నచ్చిన విషయాల్లో ఒక వస్తువు కూడ ఉందట. అదే సైకిల్. బుట్ట బొమ్మ పాట కోసం ప్రత్యేకంగా ఒక సైకిల్ తయారుచేశారు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ సైకిల్ ను చూడగానే పూజ హెగ్డేకు తెగ నచ్చేసిందట. ఆ సంగతి తెలుసుకున్న ప్రొడక్షన్ వాళ్ళు ఈమధ్యనే ఆ సైకిల్ ను భద్రంగా ప్యాక్ చేసి హైదరాబాద్ నుండి ముంబైకు పార్సిల్ చేశారట. దాన్ని చూసిన పూజా తెగ సంబరపడిపోయి ప్రొడక్షన్ వాళ్లకు థ్యాంక్స్ చెప్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె ‘రాధేశ్యామ్, ఆచార్య’ లాంటి భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు