ETV Win 3.0: 2026 సాలిడ్ లైనప్.. ఓటిటి, థియేటర్స్ లో సినిమాల క్యాలెండర్

ETV Win 3.0: 2026 సాలిడ్ లైనప్.. ఓటిటి, థియేటర్స్ లో సినిమాల క్యాలెండర్

Published on Feb 28, 2026 6:50 PM IST

ETV-Movoies

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి కంటెంట్ కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి మన లోకల్ వరకు కూడా ఈ హవా సాగుతుంది. ఇలా రీజనల్ గా మనకంటూ కూడా కొన్ని ఓటిటిలు ఉండగా వాటిలో ఈటీవీ విన్ కూడా ఒకటి. అయితే ఈటీవీ అనుబంధ సంస్థ అయినటువంటి ఈటీవీ విన్ వారు మన తెలుగు ఆడియెన్స్ కోసం ప్రత్యేకంగా మంచి క్వాలిటీ కంటెంట్ ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా వీరు కేవలం ఓటిటి లోనే కాకుండా ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ గా థియేట్రికల్ సినిమాలు కూడా చేస్తున్నారు. మరి ఇలా ఈ 2026 సాలిడ్ లైనప్ తో తమ క్యాలెండరుని ఇప్పుడు రివీల్ చేశారు. ఈటీవీ 3.0 గా వచ్చిన ఈ లిస్ట్ లో పలు ఓటిటి సినిమాలు సిరీస్ లతో పాటుగా థియేట్రికల్ గా కూడా ప్లాన్ చేసిన సినిమాలు ఉన్నాయి. మొదటిగా సినిమాలు చూసుకుంటే..

కానిస్టేబుల్ కనకం: చాప్టర్ 3 – కాల్ ఘాట్

యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ముందు సిరీస్ గా ఈటీవీ విన్ లో వచ్చి మంచి ఆదరణ అందుకుంది. రెండు సీజన్స్ మంచి హిట్ అవ్వడంతో చాప్టర్ 3 ని ‘కానిస్టేబుల్ కనకం: చాప్టర్ 3 – కాల్ ఘాట్’ గా థియేటర్స్ లో ఈ ఏడాది థియేటర్స్ లో రిలీజ్ కి అనౌన్స్ చేశారు.

‘న్యూటన్స్ థర్డ్ లా’

ప్రముఖ నటుడు సుమంత్ నటించిన ఈ చిత్రం “న్యూటన్స్ థర్డ్ లా” ఈ మే 15న థియేటర్స్ లో రిలీజ్ కి రానుంది. ఈ సినిమాని రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు.

‘సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్’

రీసెంట్ గా సాలిడ్ హిట్ “శంబాల” తో ఫామ్ లోకి వచ్చిన ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ పోలీస్ డ్రామా సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ గా అతి త్వరలో వీరి నిర్మాణం నుంచి రాబోతుంది.

#DM (#డిఎం)

ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తిని తెలుగు ఆడియెన్స్ చాలా కాలంగా మిస్ అయ్యారు. మరి తాను నటించిన ఈ కొత్త సినిమాని వీరు ఈ జూన్ 5న థియేటర్స్ లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

‘పాకశాల పంతం’

సీనియర్ నటి రమ్యకృష్ణ అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎప్పుడు ఏంటి అనేది రివీల్ చేయలేదు కానీ ఇద్దరు అత్తా కోడళ్ళు నడుమ సాలిడ్ స్టోరీతో ఈ ఏడాదిలోనే రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

‘పాపం ప్రతాప్’

మాసూద, రీసెంట్ గా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటి సినిమాలు చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏప్రిల్ 10న థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

ఇక ఇతర సిరీస్ లు సినిమాలు చూస్తే..

బాలు – గీత అనే ఒక రోమ్ కామ్, మరో యూత్ ఫుల్ డ్రామాగా ప్రొడక్షన్ నెంబర్ 13 అలాగే ఓ కోర్ట్ రూమ్ డ్రామా ప్రొడక్షన్ నెంబర్ 9, జి ఎస్ కే అనే ఓ వెబ్ ఫిలిం, ‘మాయా’ అనే మరో వెబ్ ఫిలిం, ఇంకా మందువలోగిలి, లిటిల్ థింగ్స్, ఇంకా కాప్షన్ అనుకోని ఓ ప్రశ్నార్థక ప్రొడక్షన్, ఇది వరకు ఎవరికీ తెలియని బ్లడీ వై అనే ఒక గోదావరి స్టోరీ ఇంకా జిల్లేడు చెట్టు, గుర్తుకొస్తున్నాయి అనే సిరీస్ లని వీరు ప్లాన్ చేస్తున్నారు. ఇక మొత్తంగా ఈ 2026 కి మాత్రం ప్యాకెడ్ గా ఉన్నారని చెప్పి తీరాలి. ఇక ఇవన్నీ ఎలా అలరిస్తాయి అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు