మొదటి రోజే తుపాకీ పట్టిన సూర్య

మొదటి రోజే తుపాకీ పట్టిన సూర్య

Published on Mar 19, 2021 1:25 AM IST

suriya

స్టార్ హీరో సూర్య ‘సూరరై పోట్రు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ ఉత్సాహంతోనే కొత్త సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. పాండిరాజ్ ఈ సినిమాకు డైరెక్టర్. కానీ ఈలోపే ఆయనకు కరోనా వైరస్ అటాక్ అయింది. దీంతో ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. దీంతో సినిమా వాయిదాపడింది. ఇటీవలే ఆయన పూర్తిగా కోలుకున్నారు. దీంతో షూటింగ్ మొదలైంది. సూర్య సైతం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మొదటి షెడ్యూల్లోనే యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు.

పాండిరాజ్ తన గత చిత్రంలో పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ మీదనే వర్క్ చేశారు. కానీ ఈసారి మాత్రం యాక్షన్ కంటెంట్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో సూర్య తమ్ముడు, హీరో కార్తీ అతిధి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘సూరరై పొట్రు’ తరవాత సూర్య చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. ఇందులో సూర్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు