
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా దీనిని దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా భారీ మార్పులు చేర్పులు చేసి పెట్టారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలపై గ్రాడ్యుయల్ గా అంచనాలు పెరుగుతూ వచ్చాయి.
సరే ఇదంతా బాగానే ఉన్నా మరో పక్క మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడం ఒక్కసారిగా సంచలనం రేపింది. అయినా ముందు లానే పనులు జరుగుతున్నా ఏదో పక్క చిన్న టెన్షన్ పవన్ అభిమానుల్లో కూడా నెలకొంది. రోజు రోజు కేసులు పెరుగుతున్న కొద్దీ సినిమా విడుదల టైం కు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకటితో పోలిస్తే స్వల్పంగానే పెరిగాయి.
దీనితో తెలంగాణాలో థియేటర్స్ మూసేస్తారని ఓ రూమర్ వైరల్ కాగా దానికి తెలంగాణా ప్రభుత్వం చెక్ పెట్టింది. థియేటర్స్ మూయడం జరగదని కోవిడ్ నిబంధనలతో రన్ చేస్తామని తెలిపారు. ఇలా క్లారిటీ ఇవ్వడం ఓ బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇప్పటికే సంవత్సరం వాయిదా పడ్డ చిత్రం పైగా పవన్ కం బ్యాక్ చిత్రం కావడంతో నిర్మాత దిల్ రాజు కూడా భారీ ఓటిటి ఆఫర్స్ వదులుకొని థియేట్రికల్ విడుదలకు ప్లాన్ చేసారు.
ఇప్పుడు మంచి అంచనాలు కూడా రాబట్టుకోగలిగారు అలాంటప్పుడు వకీల్ సాబ్ కి లైన్ క్లియర్ అవ్వడం శుభ పరిణామమే మరి.. మరి ముందు రోజులు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏప్రిల్ 9న విడుదల కానుంది.

